అక్కడ థియేటర్స్‌కు పర్మిషన్ వచ్చేసింది.. మరిక్కడ?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే.. అది సినీ పరిశ్రమ. కరోనా లాక్డౌన్ నుంచి దాదాపు 5 నెలలుగా షూటింగ్స్ అనేవే లేవు. నాటి నుంచి థియేటర్స్ సైతం మూతపడ్డాయి. ఇప్పటి వరకూ థియేటర్స్‌కు పర్మిషనే లేదు. అది ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేశారు. అయితే కొన్ని దేశాలు మాత్రం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశాల్లో థియేటర్లకు పర్మిషన్ ఇస్తున్నాయి. యూరప్ ఖండంలో థియేటర్స్ ఇప్పటికే ఓపెన్ అవగా.. తాజాగా అమెరికాలోనూ నేటి నుంచి థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. చైనాలో తాజాగా కరోనా పూర్తిగా కంట్రల్లోకి రావడంతో ఈ నెల 20 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చినట్టు సమాచారం.
ఇండియాలో థియటర్స్ పరిస్థితి?
ఇండియాలో ఉండటానికి 10 లక్షలకు పైగా కేసులు నమోదైనప్పటికీ యాక్టివ్ కేసులు మాత్రం 3 లక్షల 42 వేలు మాత్రమే. రికవరీ రేటు 63 శాతంగా ఉంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదని కేంద్రం చెబుతోంది. సామాజిక వ్యాప్తి దశలో లేదని.. సేఫ్‌గానే ఉన్నామని తెలిపింది. ఇదంతా కూడా త్వరలోనే కంట్రోల్లోకి వచ్చేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు షూటింగ్‌లకు పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లగలితే.. కోవిడ్‌ని తమ ద్వారా వ్యాప్తి చెందనీయబోమని ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇవ్వగలిగితే థియేటర్లకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout