అక్కడ థియేటర్స్‌కు పర్మిషన్ వచ్చేసింది.. మరిక్కడ?

  • IndiaGlitz, [Friday,July 17 2020]

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే.. అది సినీ పరిశ్రమ. కరోనా లాక్‌డౌన్ నుంచి దాదాపు 5 నెలలుగా షూటింగ్స్ అనేవే లేవు. నాటి నుంచి థియేటర్స్ సైతం మూతపడ్డాయి. ఇప్పటి వరకూ థియేటర్స్‌కు పర్మిషనే లేదు. అది ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేశారు. అయితే కొన్ని దేశాలు మాత్రం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశాల్లో థియేటర్లకు పర్మిషన్ ఇస్తున్నాయి. యూరప్‌ ఖండంలో థియేటర్స్ ఇప్పటికే ఓపెన్ అవగా.. తాజాగా అమెరికాలోనూ నేటి నుంచి థియేటర్స్‌ ఓపెన్ చేస్తున్నారు. చైనాలో తాజాగా కరోనా పూర్తిగా కంట్రల్‌లోకి రావడంతో ఈ నెల 20 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చినట్టు సమాచారం.

ఇండియాలో థియటర్స్ పరిస్థితి?

ఇండియాలో ఉండటానికి 10 లక్షలకు పైగా కేసులు నమోదైనప్పటికీ యాక్టివ్ కేసులు మాత్రం 3 లక్షల 42 వేలు మాత్రమే. రికవరీ రేటు 63 శాతంగా ఉంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదని కేంద్రం చెబుతోంది. సామాజిక వ్యాప్తి దశలో లేదని.. సేఫ్‌గానే ఉన్నామని తెలిపింది. ఇదంతా కూడా త్వరలోనే కంట్రోల్‌లోకి వచ్చేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు షూటింగ్‌లకు పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లగలితే.. కోవిడ్‌ని తమ ద్వారా వ్యాప్తి చెందనీయబోమని ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇవ్వగలిగితే థియేటర్లకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది.

More News

వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.

'క‌ల‌లు చూసినా క‌న్నులే  నేడు మోసెనే క‌న్నీల్లే.. అంటూ సిద్ శ్రీ‌రామ్ పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

తేజ చిత్రంలో మరోసారి కాజల్ అగర్వాల్‌..?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి  ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు.

క‌రోనాను లెక్క చేయ‌ని కిచ్చా సుదీప్

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్త‌బ్దుగా మారింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బతింది. సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి.

మీడియా ముందుకు కేసీఆర్!.. వరాలుండేనా?

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్ తెలంగాణను తాకిన తొలి నాళ్లలో ఆయన నాలుగు రోజులకొకసారి