కరోనా నుంచి కోలుకున్నవారు టీకా కోసం 6 నెలలు ఆగాల్సిందే..

  • IndiaGlitz, [Thursday,May 13 2021]

ప్రస్తుతం భారత్‌లో రెండు రకాల టీకాలను ప్రజలకు ఇస్తున్న విషయం తెలిసిందే. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ప్రజానీకానికి అందజేస్తోంది. అయితే ఈ టీకాల డోసుల  మధ్య వ్యవధి సహా పలు విషయాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని గతంలో 28 రోజుల నుంచి 6-8 వారాలకు కేంద్రం పొడిగించింది. అయితే  కేంద్రం  12 నుంచి 16 వారాలకు పెంచవచ్చని గురువారం నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే కొవాగ్జిన్ విషయంలో మాత్రం ఎలాంటి సూచనలూ చేయలేదు.

కాగా.. కరోనా వ్యాక్సిన్‌ను గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నవారి విషయంలో కూడా నిపుణుల ప్యానెల్ ప్రత్యేక సూచనలు చేసింది. గర్భిణులు, బాలింతలు సైతం కొవిడ్ టీకాను వేయించుకోవచ్చని నిపుణుల ప్యానెల్ వెల్లడించింది. అయితే కరోనా నుంచి కోలుకున్నవారు మాత్రం 6 నెలలు ఆగిన తర్వాత మాత్రమే టీకా వేయించుకోవాలని సూచించింది. ఇప్పటికే దేశంలో 17.72 కోట్ల మంది కొవిడ్ టీకాను వేయించుకున్నారు.

More News

టీఎన్నార్ కుటుంబానికి డైరెక్టర్ మారుతి సాయం

ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్ట్‌, నటుడు టీఎన్నార్‌ కుటుంబ సభ్యులను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి సాయం అందజేస్తున్నారు.

మరో క్రికెటర్‌కు సోనూసూద్ సాయం..

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది.

పిల్లలపైనా క్లినికల్ ట్రయల్స్.. కోవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాను చిన్నారులకు కూడా వేసేందుకు లైన్ క్లియర్ అయింది.

వేణ్నీళ్ల స్నానంతో కరోనా రాదా?

కరోనా మహమ్మారి ఎప్పుడైతే ప్రారంభమైతే అప్పటి నుంచి నివారణోపాయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపై మీటర్ రీడింగ్ మనమే తీసుకోవచ్చు..

టెక్నాలజీ డెవలప్ అయ్యాక మనం పెద్దగా బయటకు వెళ్లడం కానీ.. మన ఇంటికి ఒకరు రావడం కానీ తగ్గిపోయాయి.