Ministers:కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి: మంత్రులు

  • IndiaGlitz, [Friday,December 29 2023]

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం శుక్రవారం పరిశీలించింది. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బ్యారేజీని పరిశీలించారు. అనంతరం అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ అసలు ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులను ఇంజినీర్ల సలహాలు తీసుకొని కట్టారా? లేక కేసీఆరే స్వయంగా చీఫ్ ఇంజినీర్‌గా డిజైన్ చేశారా? ప్రజలకు తెలియాలన్నారు. సాధారణంగా కిందకు వెళ్లే నీటిని బ్యారేజీ కట్టి పైకి తీసుకు వచ్చి మళ్లీ కిందకు వదలడం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత తమకు ఆశ్చర్యం వేసిందన్నారు. అసలు ఇలాంటి ప్రాజెక్టు కట్టమని చెబితే మీరు అధికారలు ఎందుకు కట్టారని.. కట్టమని సెలవుపై వెళ్లి ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయినా... మంత్రులు అయినా... అధికారులు అయినా తప్పును తప్పుగా చెప్పాల్సిందే అన్నారు.

మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాళేశ్వరం కోసం ఎంత విద్యుత్‌ను ఉపయోగించారు? అని ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గత ప్రభుత్వం ఎందుకు స్పష్టతను ఇవ్వలేకపోయిందన్నారు. రైతులకు వీటికి సంబంధించి స్పష్టమైన సందేశం పంపించాల్సి ఉందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు గత ప్రభుత్వం తప్పు అని మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై బాంబు కుట్ర అనేది తప్పు.. బాంబు కుట్ర అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టని గొప్పలు చెప్పుకున్నారని.. కానీ వాస్తవం చూస్తే ఏమీ ఉపయోగం లేదన్నారు.

ఇక మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి మూడు బ్యారేజ్‌లు కట్టారని చెప్పారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టును పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారని.. కానీ ఈ ప్రాజెక్టులో లోపాలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ప్రాజెక్ట్ లోపాలపై చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More News

CM Jagan:భార్యలను మారుస్తూ ఉంటారు.. పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ ఘాటు విమర్శలు..

టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని.. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ పవన్ కల్యాణ్ గురించి సీఎం జగన్(CM Jagan) సెటైర్లు వేశారు.

Johnny Master:సీఎం జగన్ అంటే నాకు ఎంతో ఇష్టం: జానీ మాస్టర్

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో కనుక్కోవడం కష్టంగా మారింది.

Vyooham:'వ్యూహం' సినిమా విడుదలకు బ్రేక్.. రామ్‌గోపాల్ వర్మపై బర్రెలక్క ఫిర్యాదు..

ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'వ్యూహం' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.

YS Jagan Again: 2024లో ఏపీలో గెలిచేది జగనే .. జన్‌మత్ సర్వేలో వెల్లడి, తెలంగాణలో నిజమైన అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందన్న దానిపై ఎన్నో సంస్థలు సర్వేలను వెల్లడించాయి.

Inter Exams:తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఎప్పటినుంచంటే..?

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.