పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తర అమెరికా , వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతనిస్తోంది. పీపుల్ టెక్ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ స్థాపించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూడేళ్లపాటు మధుర గాయకుడు శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికా లో నిర్వహించింది.. గత సంవత్సరం సినిమా నిర్మాణం ప్రారంభించి , నాని హీరోగా , డీ వీ వీ దానయ్య నిర్మించిన నిన్ను కోరి చిత్రం అమెరికా షూటింగ్ మొత్తం లైన్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు నిర్వహించింది..
తాజాగా మంచు విష్ణు, బ్రహ్మానందం , ప్రగ్య జైస్వాల్ ప్రధాన పాత్రల్లో జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో ఆచారి అమెరికా యాత్ర చిత్రం అమెరికా షూటింగ్ లైన్ ప్రొడక్షన్ చేపట్టింది.. ప్రస్తుతం ఈ సంస్థ నందమూరి కళ్యాణరామ్ హీరోగా రూపొందుతున్న 'ఎం.ఎల్.ఏ' చిత్ర నిర్మాణం లో భాగస్వామి గా ఉంది.
శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ 2019 సంవత్సరానికి గాను సియాటెల్ లో జరుగనున్న నాట్స్ నేషనల్ కన్వెన్షన్ కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా నియమితులైనందున , అక్టోబర్ 1 2017 న సియాటెల్ లో భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది మీడియా ఫ్యాక్టరీ . వాటా , వాట్స్ తదితర స్థానిక తెలుగు సంస్థల సహకారం తో జరిగే ఈ కార్యక్రమం పేరు మీట్ అండ్ గ్రీట్ బ్రహ్మానందం , మంచు విష్ణు , ప్రగ్య , ప్రభాస్ శ్రీను .
ఈ కార్యక్రమానికి హాజరు కాదలచిన వారు ఇక్కడ క్లిక్ చేసి వారి ఆగమనాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చును
నాట్స్ 2019 సభ్యత్వం పొందిన ఎన్నారై లందరు ఈ రెండేళ్లలో పీపుల్ మీడియా నిర్వహించు అన్ని కార్యక్రమాలలోను ఉచితంగా ప్రవేశము పొందగలరు ..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com