సింగర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. కట్టలు తెంచుకున్న అభిమానం
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో సినీనటులు, కళాకారులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని దైవంలా పూజిస్తూ వుంటారు అభిమానులు. ఎంతగా అభిమానిస్తారో.. ఆగ్రహం వస్తే అదే స్థాయిలో రగిలిపోతూ వుంటారు. ఇప్పుడు అచ్చం అదే పరిస్ధితి ఎదురైంది ఓ భోజ్‌పురి సింగర్‌కి. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లోని సున్సారి జిల్లా బుర్జ్‌లోని విరాట్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బుర్జ్ మహోత్సవ్ సందర్భంగా విరాట్‌నగర్‌లో లైవ్ షోకు ప్లాన్ చేశారు భోజ్‌పురి సింగర్ ఖేసరి లాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన బృందంతో ఆయన నేపాల్ వెళ్లాడు.
ఖేసరిలాల్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు.. ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉదయం నుంచే వందల సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాదు ఈ షోట ఎంట్రీ కోసం ప్రేక్షకుల నుంచి నిర్వాహకులు రూ.300 వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంతా బాగానే వున్నప్పటికీ షో టైం అయినా ఖేసరి లాల్ వేదిక వద్దకు చేరుకోలేదు. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది కుర్చీలు, వాహనాలకు నిప్పంటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను నేపాల్‌లోనే ఉన్నానని, షోకు వచ్చే ముందు కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు అనుమతి నిరాకరించారని ఖేసరి లాల్ వివరణ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout