Chandrababu:పెన్షనర్లపై కక్షగట్టిన చంద్రబాబు.. తగిన బుద్ధి చెబుతామంటున్న ప్రజలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గరి నుంచి రాష్ట్రంలోని పెన్షనర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కక్షకట్టారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరి పింఛన్లు అందించేవారు. కానీ చంద్రబాబు వాలంటీర్ల మీద తన ఆక్రోశం వెల్లగక్కారు. తన తాబేదారు, మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి ఇంటింటి పింఛన్ పంపిణీని అడ్డుకున్నారు. దీంతో తమ పన్నాగం ఫలించిందని బాబు అండ్ కో సంబరపడ్డారు. అయితే వారి కుట్రల వల్ల ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లు దూరమయ్యారు.
ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తానన్న వాలంటీర్ రాకపోవడంతో వృద్ధులు రగిలిపోతున్నారు. తాము ఇన్ని ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబు అని తెలుసుకుని తిట్ల దండకం మొదలుపెట్టారు. అలాగే ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తారని ప్రచారం జరుగుతుంది. దీంతో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన పసుపు బాస్.. ఇపుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు.
అయితే ఇంటింటి పింఛన్ల పంపిణీని అడ్డుకున్న చంద్రబాబే.. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు ఇప్పించాలని మొసలి కన్నీళ్లు కార్చడం సర్వత్రా విమర్శలు వస్తున్నారు. మీరే పంపిణీని అడ్డుకుని.. ఇప్పుడు మీరే మళ్లీ ఇంటింటికి పంపిణీ చేయాలని సలహాలు ఇవ్వడం మీ కుటిల బుద్ధికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను పిక్కుతినే చంద్రబాబు లాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో తమ ఓటుతో మరోసారి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout