ఏం సాధించారని 'పచ్చ' నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

ఏదో సాధించినట్లు సంబరాలు.. స్వాత్రంత్య సమరయోధుడు జైలు నుంచి బయటకు వచ్చినట్లు బిల్డప్‌లు.. పచ్చ నేతల హంగామా ఇంతా కాదు. స్కిల్ స్కాం అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణాలతో మధ్యంత బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబుకు హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అంతే ఆ పార్టీ శ్రేణులు, ఎల్లో మీడియా చేసిన ఓవర్ యాక్షన్, చూపిన అత్యుత్సాహం ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఎల్లోమీడియా పత్రికలూ, ఛానెళ్లలో సైతం ఓవైపు అమాయకుడైన బాబును అరెస్ట్ చేశారు అని రోధిస్తూనే మరోవైపు ఘనంగా బెయిల్ వచ్చింది.. న్యాయం గెలిచింది.. అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురించారు.

జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఒక నిందితుడిని కీర్తిస్తూ కథనాలు వండి వార్చారు. కొంపదీసి బోలెడు యుద్ధాలు గెలిచి వస్తున్న బాజీరావు వస్తున్నాడా.. కళింగ వరకూ విజయయాత్ర చేసుకుని కృష్ణదేవరాయలు తిరిగి వస్తున్నారా? ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచి స్వదేశం వస్తున్న ఆటగాడా ? వరల్డ్ కప్ గెలిచి వస్తున్న మహా క్రీడాకారుడా? దేనికోసం ఎల్లోమీడియా ఆత్రం.. ఏమి చేస్తున్నారో తెలియనంత సోయలేకుండా ఉన్నారా? అవినీతి కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద వస్తుంటే అంత సంబరాలు దేనికి? అంటే ఇన్నాళ్లుగా దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న పార్టీకి ఓ ముసలి దిక్కు లభించిందన్న ఆనందం తప్ప అయన విడుదలతో ప్రజలకు ఏమి ఒరిగిందనే ప్రశ్న తలెత్తుంది. చంద్రబాబు అవినీతి చేయలేదని హైకోర్టు చెప్పలేదు.. అలాగే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని స్పష్టంచేసింది. ఇప్పటికే సీఐడీ కూడా దాదాపు 140 వరకూ ఆధారాలు సేకరించినట్లు కోర్టులో పేర్కొంది. ఇవన్నీ వదిలేసి దండలూ... దండాలూ.. డ్రామాలూ.. అసలు ఏం చేస్తున్నారో ఒంటి మీద స్పృహ ఉందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బెయిల్ రాగా దాన్ని సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ పలు అంశాల్లో హైకోర్టు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషనర్లు వాదించని, కోరని అంశాల్లోకి కూడా న్యాయస్థానం వెళ్లేందుకు ప్రయత్నించిందని.. తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యనాలు చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, దర్యాప్తులో లోపాలు గురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే కామెంట్లు చేసిందంటున్నారు. సీఐడీ దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం ఇష్టానుసారం కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

స్కిల్‌ స్కాంకు సంబంధించిన డబ్బు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారాలు లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఇది తొందరపాటుగా భావిస్తున్నామని సీఐడీ పేర్కొంది. ఇంతేకాకుండా టీడీపీ నుంచి ఎవరూ ఇప్పటివరకూ దర్యాప్తునకు హాజరు కాలేదు సీఐడీ అడిగిన సమాచారం కూడా ఇవ్వలేదు. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశామని.. అలాంటపుడు ఆ డబ్బు టీడీపీ ఖాతాకు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేస్తుందంటూ సీఐడీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ఈ కేసులో చంద్రబాబును ఎలా బాధ్యుడ్నిచేస్తారంటూ బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేరం జరగడానికి దారితీసిన పర్యవసానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలుపంచుకున్నా దాన్ని తీవ్రంగానే చూస్తుమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటపుడు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు కోర్టు వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధం అని ప్రభుత్వం, సీఐడీ అభిప్రాయపడుతూ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నాయి.

More News

కబడ్డీ కోసం బరిలో దిగిన బాలయ్య, కిచ్చ సుదీప్, టైగర్ ష్రాప్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) అటు సినిమాలు.. ఇటు టాక్‌ షో, యాడ్స్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ చేస్తు్న్న అన్‌స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్‌ అవ్వగా..

KCR: కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఎన్నికల ప్రచారంలో

Pawan Kalyan: విశాఖ హార్బర్ ప్రమాద బాధితులకు సాయం చేయనున్న పవన్ కల్యాణ్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

Hi Nanna Trailer: 'హాయ్ నాన్న' ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చేస్తున్నాడు నాని.

Chiranjeevi: ఆ మాటలు అసహ్యంగా వున్నాయి.. త్రిషకి అండగా నిలబడతా: చిరంజీవి

అగ్ర కథానాయిక త్రిషపై కోలీవుడ్ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశ్రమలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు.