Chandrababu:జగన్‌ని ఓడించేందుకు జనం కూడా సిద్ధంగా ఉన్నారు: చంద్రబాబు

  • IndiaGlitz, [Saturday,January 27 2024]

వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించేందుకు జనం సిద్దంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈసారి వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని.. ఈ యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. రాయలసీమ జిల్లాల్లో 'రా కదలిరా' సభల్లో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైనాట్ 175 అంటున్న జగన్‌కు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. వైనాట్ పులివెందుల అని.. పులివెందులలో టీడీపీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.

నాడు అదే బడ్జెట్.. నేడు అదే బడ్జెట్ అన్నావ్.. మరి పన్నులు ఎందుకు వేశావ్ జగన్ అని నిలదీశారు. దోచిందంతా అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో ఒక్క మంచి మంత్రి కూడా లేరని.. ఒక్క మంత్రి ఏమో పదవుల కోసం సొంత కార్యకర్తల నుంచే లంచం తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక పుంగనూరు పుడింగి పాపాల పెద్దిరెడ్డి అన్నంకి బదులు ఇసుకే తినేటట్లు ఉన్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉదయం ఇసుక, మధ్యాహ్నం మైన్స్, రాత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేడన్నారు. అధికారంలోకి రాగానే తానంటే ఏంటో చేసి చూపిస్తానని పెద్దిరెడ్డిని హెచ్చరించారు.

టీడీపీ-జనసేన కూటమి గెలుపు.. వైసీపీ జెండా పీకేయటం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారన్నారు. ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? అని ప్రశ్నించారు. తాను రాయలసీమ బిడ్డనే నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమేనన్నారు. తన పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని వెల్లడించారు. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారని, ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టలేదు గుర్తుచేశారు. మద్య నిషేదంపై మాట తప్పి మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో పేదల రక్తం తాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకులేవు అంటూ ఫైర్ అయ్యారు. ఇంత దుర్మార్గపు పాలన చేసిన జగన్‌ను ఇంటికి పంపించేందుకు రైతులు, ఉద్యోగులు, మహిళలు, యువత అందరూ సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

More News

Upasana:తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణులు.. చాలా గర్వంగా ఉంది: ఉపాసన

మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం పట్ల ఆయన కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.

Thalapathy Vijay: రాజకీయాల్లోకి దళపతి విజయ్.. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన..!

సినిమాలకు రాజకీయాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు.

Sharmila: YCP అంటే వైవీ.. సాయిరెడ్డి.. రామకృష్ణారెడ్డి.. షర్మిల సెటైర్లు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సారే లేరని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. ఇప్పుడు ఉన్నది YSR పార్టీ కాదని..

Nagababu:చర్యకు ప్రతిచర్య ఉంటుంది.. టీడీపీకి కౌంటర్‌గా నాగబాబు ట్వీట్..

టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు రచ్చకు దారి తీస్తోంది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై

Dhanush Son Yatra: అచ్చు గుద్దినట్లు హీరో ధనుష్‌ను దించేసిన పెద్ద కొడుకు 'యాత్ర'

తమిళ స్టార్ హీరో ధనుష్.. తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం. తెలుగులో '3', 'రఘువరన్ బీటెక్'