బికినీలో 'పెళ్లిసందడి' హీరోయిన్ ఎక్స్ పోజింగ్.. 53 ఏళ్ల వయసులో ఇలా..
Send us your feedback to audioarticles@vaarta.com
స్వప్నసుందరి అంటూ 'పెళ్లి సందడి'లో సందడి చేసిన దీప్తి భట్నాగర్ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఆల్ టైం క్లాసిక్ పెళ్లిసందడిలో దీప్తి గ్లామర్ హైలైట్ గా నిలిచింది. పెళ్లి సందడి చిత్రం విడుదలై పాతికేళ్ళయిపోతోంది. ప్రస్తుతం దీప్తి వయసు 53 ఏళ్లు. అయినప్పటికీ ఆమె అందం వన్నె తరగలేదు.
సోషల్ మీడియాలో దీప్తి పోస్టులని గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికి దీప్తి గ్లామర్ ఘాటు తగ్గలేదు. ఈ వయసులో కూడా దీప్తి హాట్ ఫోజులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఫోటో షూట్స్ పై మక్కువతో దీప్తి ఇలా నిత్యం అందమైన ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల దీప్తి బికినీ ఇచ్చిన ఫోజు వైరల్ గా మారింది. బ్లాక్ బికినిలో పూల్ పక్కన అందాలు ఆరబోస్తూ పడుకుని సేదతీరుతున్న స్టిల్ వైరల్ అవుతోంది. అదిరిపోయే హాట్ నెస్ తో ఉన్న ఈ పిక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ పిక్ కు దీప్తి పెట్టిన క్యాప్షన్ ఆసక్తిగా ఉంది. బికినిలో ఫోజు ఇస్తున్న దీప్తి 'నో నెగిటివ్ థాట్స్' అని కామెంట్ పెట్టింది. వివాహం తర్వాత దీప్తి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఛాన్స్ వస్తే తల్లి తరహా పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుందేమో చూడాలి.
పెళ్లి సందడి తర్వాత దీప్తి సుల్తాన్, ఆటో డ్రైవర్ చిత్రాల్లో కూడా నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments