కన్నడలో 'పెళ్లిచూపులు' రీమేక్...
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవర కొండ, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మాతలుగా రూపొందించిన చిత్రం పెళ్లిచూపులు ఈ ఏడాది జూలైలో విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ హిట్ కొట్టింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా పెద్ద హిట్ కావడంతో అందరి దృష్టి సినిమాపై పడింది. ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ రీమేక్ చేయనుండటం విశేషం. అలాగే తమిళంలో దర్శకుడు గౌతమ్‌మీనన్ ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు.
అలాగే కన్నడంలో పెళ్లిచూపులు రీమేక్ త్వరలోనే సెట్స్‌లోకి వెళ్లనుంది. కన్నడంలో యంగ్ హీరో గురునాథన్ హీరోగా యు టర్న్ ఫేమ్ శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్‌గా శాండీల్‌వుడ్ కొరియోగ్రాఫర్ మురళీ మాస్టర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com