పెళ్లిచూపులు హీరో నెక్ట్స్ మూవీ డీటైల్స్..!
Friday, August 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లిచూపులు చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ అర్జున్ రెడ్డి, సూపర్ గుడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ద్వారకా చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత విజయ్ నటించే చిత్రం కన్ ఫర్మ్ అయ్యింది.
ఇంతకీ విజయ్ ఎవరితో సినిమా చేయనున్నాడంటే...అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే చిత్రాల దర్శకురాలు నందినీ రెడ్డి తో విజయ్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇటీవల నందినీ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఓకే చెప్పాడట. ఈ చిత్రంలో విజయ్ సరసన కళ్యాణ వైభోగమే ఫేమ్ మాళవిక నాయర్ నటిస్తుందట. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుందని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments