పెళ్లిచూపులు హీరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ డీటైల్స్..!
Saturday, October 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లిచూపులు సినిమాతో అటు ఆడియోన్స్ లో, ఇటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ద్వారక అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...ఈ యంగ్ హీరోతో విభిన్న కథాచిత్రాల దర్శకుడు రవిబాబు ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. విజయ్ దేవరకొండ - రవిబాబు కాంబినేషన్లో రూపొందే ఈ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ ని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments