ఓవర్ సీస్ లో కూడా రాణిస్తున్న 'పెళ్ళిచూపులు'
Send us your feedback to audioarticles@vaarta.com
తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం `పెళ్ళిచూపులు`. విజయ్‌దేవరకొండ, రీతూవర్మ నటించిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన రోజు కంటే ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా చూసిన నిర్మాత డి.సురేష్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్‌సీస్‌లో సైతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యు.ఎస్‌లో ఇప్పటి వరకు $ 330,662, అంటే మొత్తంగా రెండు కోట్ల 20 లక్షలును కలెక్ట్ చేసింది. చిన్న చిత్రానికి ఈ రేంజ్ కలెక్షన్స రావడం మంచి పరిణామమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments