మమ్మల్ని కామెంట్ చేసిన వాళ్లకు అదే సమాధానం - హీరో విజయ్ దేవరకొండ

  • IndiaGlitz, [Saturday,August 06 2016]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న క‌థాచిత్రం పెళ్లిచూపులు. ఈ చిత్రాన్ని రాజ్‌కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన పెళ్లిచూపులు ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు అందుకుంటుంది. ఈ సంద‌ర్భంగా పెళ్లి చూపులు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
మీ జ‌ర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది..?
నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే మ‌క్కువ ఎక్కువ‌. డిగ్రీ పూర్త‌యిన త‌ర్వాత ఏక్టింగ్ పై ఉన్న ఇంట్ర‌స్ట్ తో హైద‌రాబాద్ లోని స్టేజ్ షోస్ చేసేవాడిని. అయితే...మా డాడీ సినిమా ఆఫీస్ ల‌కు వెళ్లి ఫోటోస్ ఇవ్వాలి. అంద‌ర్నీ క‌ల‌వాలి అని చెప్పేవారు. నాకేమో అలా చేయ‌డం ఇష్టం ఉండేదు కాదు. సినిమా ఆఫీస్ ల‌కు వెళ్లాను ఫోటోస్ ఇచ్చాను అని మా డాడీతో చెప్పేవాడిని. అయితే...లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ కోసం ఫోటోస్ ను ఈమెయిల్ చేయ‌మ‌ని ఎక్క‌డో చూసి ఫోటోస్ మెయిల్ చేసాను. ఆడిష‌న్ కి పిలిచారు...కాక‌పోతే చిన్న రోల్. నేనేమో మెయిన్ రోల్ ఇస్తార‌నుకున్నాను. చిన్న రోల్ ఏం చేయాలి అని ఆలోచించి ఖాళీగా ఉండ‌డం క‌న్నా ఏదోటి చేద్దాం... అదీ కాకుండా శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా కాబ‌ట్టి ఓకే చెప్పాను. ఆత‌ర్వాత ఆ సినిమా చేస్తున్న టైమ్ లో నాగ్ అశ్విన్ ప‌రిచ‌యం అయ్యాడు. ఆయ‌న ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఆ సినిమాలో నా క్యారెక్ట‌ర్ న‌చ్చి త‌రుణ్ భాస్క‌ర్ పెళ్లిచూపులులో అవ‌కాశం ఇచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నా జ‌ర్నీ.
పెళ్లిచూపులు ఈరేంజ్ స‌క్సెస్ సాధిస్తుంది అని ఊహించారా..?
మేము డిఫ‌రెంట్ ఫిల్మ్ చేస్తున్నాం అనుకున్నాం కానీ...దాదాపు 25 కోట్లు క‌లెక్ట్ చేసే రేంజ్ మూవీ అవుతుంది అని అస‌లు ఊహించ‌లేదు.
ఈ సినిమాని డిఫ‌రెంట్ గా సింక్ సౌండ్ లో చేసారు క‌దా..ఆ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?
నేను స్టేజ్ షోస్ చేసాను కాబ‌ట్టి ఎలాంటి డైలాగ్ అయినా స‌రే చెప్ప‌గ‌ల‌ను. నాకు ప్రాబ్ల‌మ్ లేదు. అయితే...సౌండ్ సింక్ లో చేయాలంటే ఆర్టిస్టులు అంద‌రికీ తెలుగు తెలుసుండాలి. డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విష‌యం ఏమిటంటే...మ‌న‌కు క‌నిపించ‌కుండా చిన్న మైకుల‌ను సెట్ చేస్తారు. ఆ మైకులు తీసేట‌ప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.ఏది ఏమైనా...ఈ మూవీని సింక్ సౌండ్ లో చేయ‌డం అనేది మ‌ర‌చిపోలేని అనుభూతి. నాకు తెలిసి అన్ని సినిమాల‌ను ఇలా చేయ‌డం కుద‌రదు.
రెగ్యుల‌ర్ గా కాకుండా డిఫ‌రెంట్ గా స్టోరీతో సినిమా చేసారు క‌దా..! సినిమా చేస్తున్న‌ప్పుడు మీకు ఎలాంటి ప్రొత్సాహం ల‌భించింది..?
ఈ క‌థ గురించి చెప్పిన‌ప్పుడు చాలా మంది క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేవు. వ‌ర్క‌వుట్ కాదు. డైరెక్ట‌ర్ కొత్త‌, ఆర్టిస్టులు కూడా కొత్త. బిజినెస్ అవ‌దు ఇలా ర‌క‌ర‌కాలుగా కామెంట్ చేసారు. అయితే...మా నిర్మాత‌లు రాజ్ కందుకూరి, యష్ రంగినేని సింగిల్ సిటింగ్ లోనే క‌థ విని ఓకే చేసారు. కామెంట్ చేసిన వాళ్ల‌కు మా సినిమా స‌క్సెసే సమాధానం.
ఇంత‌కీ ఈ సినిమా స‌క్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..?
ఏమిటో అర్ధం కావ‌డం లేదండి. అస‌లు ఎంజాయ్ చేయ‌డం అంటే ఏమిటో అర్ధం కావ‌డం లేదు. ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది.
ఇండ‌స్ట్రీ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి..?
ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది కాంప్లిమెంట్స్ పంపించారు. ప్ర‌తి రోజు నా ఫోన్ మెసేజ్ ల‌తో నిండిపోతుంది. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు. ఎంత మంది కాంప్లిమెంట్స్ పంపించారో..!
ఈ మూవీలో కుకింగ్ చేసారు క‌దా..నేర్చుకున్నారా..?
కుకింగ్ నాకు అస‌లు రాదు. ఫ‌స్ట్ డే అయితే చాలా ఇబ్బంది ప‌డ్డాను. డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఎలా చెబితే అలా చేసాను. నెక్ట్స్ డే చైనీస్ బండివాడిని సెట్ కి తీసుకువ‌చ్చి నాకు ట్రైనింగ్ ఇప్పించారు. దాంతో కొంచెం ఈజీ అయ్యింది.
స‌ల్మాన్ ఖాన్ కి ఈ చిత్రాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విన్నాం..నిజ‌మేనా..?
నేను విన్నాను. స‌బ్ టైటిల్స్ వేసి స‌ల్మాన్ కి చూపించాలి అని ట్రై చేస్తున్న‌ట్టు తెలిసింది.
హిందీలో రీమేక్ చేస్తే మీరు చేస్తారా..?
ఒక‌సారి చేసిన ప‌ని మ‌ళ్లీ చేయ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. అలా చేస్తే 10 టు 6 లా రెగ్యుల‌ర్ జాబ్ అయిపోతుంది. అందుచేత హిందీలో రీమేక్ చేస్తే అందులో నేను న‌టించాలి అనుకోవ‌డం లేదు.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ద్వార‌కా చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ చిత్రానికి ఎం.ఎస్.ఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే అర్జున్ రెడ్డి అనే చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ రెండు చిత్రాల త‌ర్వాత వైజ‌యంతీ మూవీస్, పెళ్లిచూపులు నిర్మాణ సంస్థ ల్లో సినిమాలు చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.