పెళ్లి సందడి రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు...?
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పటి వరకు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శ్రీకాంత్ కెరీర్ లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి పెద్ద బ్రేక్ తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయట. ఈ రీమేక్ లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం రోషన్ నిర్మలా కాన్వెంట్ విడుదలకు సిద్ధంగా ఉంది. లవర్ బోయ్ ఇమేజ్ కూడా రాని ఈ కుర్ర హీరో ఇలాంటి తరుణంలో పెళ్లిసందడి వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రీమేక్ లో చేయడం ఎంత వరకు కరెక్టో అని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై ఎవరో ఒకరు స్పందిస్తే కానీ నిజానిజాలు తెలియవు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com