50 రోజులుతో యు.ఎస్ లో రికార్డ్ క్రియేట్ చేసిన పెళ్లిచూపులు..!
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం పెళ్లిచూపులు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించారు. చిన్న చిత్రంగా రిలీజైన పెళ్లిచూపులు ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు యు.ఎస్ లో కూడా విజయవంతంగా పెళ్లిచూపులు 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. కొత్తకథలతో రూపొందే చిన్న చిత్రాలకు పెళ్లిచూపులు ఊపిరినిచ్చింది. యు.ఎస్ లో 10 సెంటర్స్ లో పెళ్లిచూపులు చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇలా యు.ఎస్ లో 10 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు చిత్రంగా పెళ్లిచూపులు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి స్పందిస్తూ.... పెళ్లిచూపులు చిత్రం ఇంతటి విజయాన్ని సాధించి 50 రోజులు పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన రోజు ఇది. ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ, రీతువర్మ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే ఈ చిన్ని చిత్రాన్ని ఎంతో మందికి రీచ్ అయ్యేలా ఎంతగానో సహకరించిన క్రిటిక్స్, సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్ టీమ్ & మధుర శ్రీధర్ రెడ్డి & టీమ్ అందరికీ థ్యాంక్స్. నిర్మాతగా నా 10 ఏళ్ల ప్రయాణంలో పెళ్లిచూపులు విజయం మరెన్ని మంచి సినిమాలు తీసేలా బాధ్యతను పెంచింది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments