సురేష్ బాబు చేతుల మీదుగా పెళ్ళి చూపులు ఆడియో విడుదల
- IndiaGlitz, [Friday,July 08 2016]
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పెళ్లి చూపులు. ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్, వినూత్న గీత బ్యానర్స్ పై రాజ్ కందుకూరి, యస్ రాగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ గా రూపొందిన పెళ్ళి చూపులు చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. త్వరలో రిలీజ్ కానున్న పెళ్లి చూపులు ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. థియేట్రికల్ ట్రైలర్ ను సందీప్ కిషన్, తమ్మారెడ్డి భరద్వాజ, క్రాంతిమాధవ్ లు విడుదల చేశారు.బిగ్ సీడీ, ఆడియో సీడీలను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేసి... తొలి ఆడియో సీడీని తమ్మారెడ్డి భరద్వాజ అందచేసారు.
ఈ సందర్భంగా డి.సురేష్ బాబు మాట్లాడుతూ...యంగ్ టీమ్ కలిసి చాలా మంచి సినిమా చేశారు. నాగేష్ సినిమాటోగ్రపీ, వివేక్ మ్యూజిక్ చాలా బావుంది. విజయ్, రీతూ సహా అందరూ చాలా బాగా వర్క్ చేశారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మా బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని భావిస్తూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...ట్రైలర్ బావుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ వినగానే చాలా నచ్చేసింది. ఎవడే సుబ్రమణ్యం పేమ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఆ సినిమా కంటే బెటర్ గా చేసుంటాడని అనుకుంటున్నాను. రాజ్ కందుకూరి, యష్ రంగినేని గారు సహా టీంకు నా అభినందనలు అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ...మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. తరుణ్ భాస్కర్, విజయ్ దేవర కొండ అండ్ మంచి టీమ్ కలిసి చేసిన సినిమా ఇది.ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు.
కె.దశరథ్ మాట్లాడుతూ...ఈ మూవీ విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. టైటిల్ క్యాచీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఈ చిత్ర దర్శక నిర్మాతలకు నా బెస్ట్ విషెష్ అన్నారు.
రామరాజు మాట్లాడుతూ....రాజ్ కందుకూరితో నాకు పరిచయం ఉంది. వివేక్ మ్యూజిక్ చాలా బావుంది. విజయ్ దేవరతో కూడా పరిచయం ఉంది. ఈ చిత్రం విజయ్ దేవరకొండ, నందు సహా అందరికీ మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
అశోక్ కుమార్ మాట్లాడుతూ... క్యాచీ టైటిల్ పెళ్ళిచూపులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైనది. అందరికీ కనెక్ట్ అవుతుంది. పెళ్ళైన వారు గుర్తుకు తెచ్చుకునే సందర్భం. టైటిల్‌తోనే సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అన్నారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...వివేక్ సాగర్ చాలా చక్కని సంగీతాన్ని అందించారు. ఈ కథను తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ దగ్గర విన్నాను. చాలా మంచి కథ. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.
అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ...ఆనంద్, ఉయ్యాలా జంపాలా తర్వాత అదే జోనర్‌లో కనపడుతున్న చిత్రమిది. రాజ్ కందుకూరిగారు ఈ సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి పెద్ద నిర్మాత అవ్వాలి అన్నారు.
రఘు కుంచె మాట్లాడుతూ...బాలీవుడ్ లో యశ్ రాజ్ సంస్థ ఎంత పెద్ద సంస్థో మనకు తెలిసిందే. ఇక్కడ రాజ్ గారు, యష్ రంగినేనిగారు కలిసి చేస్తున్న ఈ సినిమాతో వారు కూడా ఆస్థాయి నిర్మాతలు కావాలని కోరుకుంటున్నాను. వివేక్ మ్యూజిక్, లిరిక్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. చిన్న సినిమాకు సౌండింగ్, సినిమాటోగ్రఫీ బావుంటే చాలా అందంగా ఉంటుంది. ఆ రెండు అంశాలు ఈ సినిమాలో బావున్నాయి. ఈ ఈ టీమ్ కి నా అభినందనలు అన్నారు.
కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ....విజయ్‌లో చాలా మంచి ఎనర్జీ ఉంది. డైరెక్టర్ భాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్‌లో మంచి స్టఫ్ ఉంది. మంచి టీంతో కలిసి చేసిన ప్రయత్నమిది. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
మామిడిపల్లి గిరిధర్ మాట్లాడుతూ....పెళ్ళిచూపులు కథ నాకు తెలుసు. చాలా వైవిధ్యంగా ఉంటుంది. బ్యూటీఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, అలాగే ఒక మంచి టీమ్ కలిసి చేసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుంది అన్నారు.
అడివిశేష్ మాట్లాడుతూ...పెళ్లి చూపులు టీజర్ చూడగానే నాకు రీతు, విజయ్ దేవరల యాక్షన్ చాలా బాగా నచ్చింది. విజయ్ కోసం నేను ఒక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను. అలాగే వివేక్‌తో కూడా సినిమా చేయాలనేంత బాగా ట్యూన్స్ ఉన్నాయి. రాజ్, శ్రీధర్‌గారు, యష్ గారితో నాకు బాగా పరిచయం ఉంది. ఈ సినిమా వారికి సక్సెస్ ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
క్రాంతిమాధవ్ మాట్లాడుతూ...విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ టీమ్ తో నాకు మంచి పరిచయం ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ... ట్రైలర్ చూడగానే నాకు బాగా నచ్చేసింది. ఈ ట్రైలర్‌ను అందరికీ చూడాలనిపించి మా గ్రూప్‌లోని ఫ్రెండ్స్‌కు పంపాను. భాస్కర్ గతంలో చేసిన షార్ట్ పిలిం గురించి తెలిసింది. తనకు ఆల్ ది బెస్ట్. ఎవడే సుబ్రమణ్యంలో విజయ్ దేవరకొండ నటన బాగా నచ్చింది. తన నెక్ట్స్ మూవీ అర్జున్ రెడ్డి గురించి కూడా బాగా తెలుసు. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ...ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం సురేష్‌బాబుగారే. ఆయనే ఈ దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను పంపి కథ వినమన్నారు. కథ వినగానే బాగా నచ్చింది. ఈ సినిమా కోసం యష్ కూడా కలవడం చాలా ప్లస్ అయ్యింది. యంగ్ టీమ్ కలిసి చేసిన సినిమా ఇది. తరుణ్‌ను, ఈ టీమ్ ను ఇంట్రడ్యూస్ చేసినందుకు ఫ్యూచర్ లో గర్వపడతాను. భవిష్యత్‌లో నేను చేసే సినిమాల్లో పెళ్ళి చూపులు నేను గర్వపడే సినిమా అవుతుందని చెప్పగలను. వివేక్ సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ అందించాడు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.
నిర్మాత యష్ మాట్లాడుతూ...రాజ్ కందుకూరితో చాలా కాలంగా మంచి పరియం ఉంది. సురేష్ బాబుగారు మొదటి నుండి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకి థాంక్స్. ప్రేక్షకులు ఆశీర్వాదంతో సినిమా పెద్ద హిట్ అవుతుంది. తరుణ్ భాస్కర్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. తను యూనిక్ ఐడియా ఉన్న దర్శకుడు. తన ఆలోచనలకు వెల కట్టలేం. విజయ్, రీతూ చక్కగా నటించారు. వివేక్‌సాగర్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు అన్నారు.
వివేక్ సాగర్ మాట్లాడుతూ... నిర్మాతలు చాలా స్వేచ్చ ఇచ్చారు. తరుణ్ తో చాలా కాలంగా మంచి పరిచయం ఉంది. తను ఓపెన్‌గా ఉంటూ మంచి మ్యూజిక్ రాబట్టుకుంటాడు. టీమ్ నాకు అండగా నిలబడింది. సింక్ సౌండ్‌లో మ్యూజిక్ చేశాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ...నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. అందరూ అండగా నిలబడ్డారు. నిర్మాతలు చాలా ఫ్రీడం ఇచ్చారు. నాకు తండ్రుల్లా సపోర్ట్ చేశారు. ఇది నిజమైన వ్యక్తులకు సంబంధించిన కథ. మా అమ్మగారు, భార్య నాకు అండగా నిలబడ్డారు. సురేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్ అన్నారు.
విజయ్ దేవర కొండ మాట్లాడుతూ....వివేక్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించారు. మంచి నిర్మాతలు దొరికారు. తరుణ్ మా నుండి మంచి నటనను రాబట్టుకన్నారు. అందరినీ ఎంటర్ టైన్ చేసే చిత్రమవుతుంది. సహకారం అందించిన అందరికీ థాంక్స్ అన్నారు.
గోవి, సిద్ధు, సుధాకర్ కోమాకుల, నందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.