వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
- IndiaGlitz, [Tuesday,April 02 2019]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కాబోతున్నారని ఆ పార్టీ కీలకనేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం సాయంత్రం కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా రాయచోటి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖoడ విజయం సాధించి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పుకొచ్చారు.
పెద్దిరెడ్డి మాటల్లోనే...
సర్వేలు అన్నీ వైసీపీకి 135-145 ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. దీంతో రాష్ట్రంలో టీడీపీ ధీన స్థాయిలో ఉండిపోయింది. చంద్ర బాబు కూడా సొంత పార్టీ అభ్యర్థుల మీదనే చిందులు వేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఓటమి అర్థమై ఆ పార్టీ నాయకులు దిగులు చెందుతున్నారు. వైసీపీ నాయకులు అంత కలసికట్టుగా కష్టపడి పార్టీ గెలుపుకు కృషి చేస్తుడటం చాలా సంతోషకరమైన విషయం. వైసీపీ గెలుపు ఖాయం.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కంటే వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారు. ఎల్లో మీడియా సహకారంతో ఉన్నవి.. లేనివి చూపుతూ రాష్ట్రమంతా గ్రాఫిక్స్ మాయం చేసిన చంద్రబాబు వేశాలు ప్రజలు నమ్మరు అని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ నేతలు దశరధ రామిరెడ్డి, అఫ్జల్ ఖాన్, సల్లావుద్దీన్, అలీ నవాజ్ ఖాన్‌తో పాటు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.