పుట్ట మధు అరెస్ట్.. ఈటల అనుచరులే టార్గెట్?
Send us your feedback to audioarticles@vaarta.com
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధును పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఆయనను భీమవరంలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పుట్ట మధుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. గత ఏడు రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. మధు మిస్సింగ్‌పై ఆయన భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సైతం స్విచ్ఛాప్ చేసి ఉండటంతో అసలు ఆయన ఏమయ్యారనే విషయం మిస్టరీగా మారింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌తో పుట్ట మధు సన్నిహితంగా మెలిగేవారు. ఈటల ఎపిసోడ్ అనంతరం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Also Read: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 విమానాల రద్దు
ఓ కేసు విషయంలో వారం రోజులు క్రితం పుట్ట మధు కు కాల్ చేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారి తర్వాతే ఆయన మంథని పట్టణాన్ని వీడి అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలను బర్తరఫ్ చేయడంతో.. తను కూడా టార్గెట్ అవుతాననే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది.
పుట్ట మధు పాత్ర లేదని తేల్చిన పోలీసులు
మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును పోలీసులు మరోసారి విచారణ నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కేసులో పుట్ట మధు పాత్ర ఏమీ లేదని పోలీసులు గతంలో తేల్చారు. అలాగే ఈ కేసుకు టీఆర్ఎస్‌కు చెందని ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధమూ లేదని సీఎం కేసీఆర్ సైతం అసెంబ్లీలో తేల్చి చెప్పారు. అయితే న్యాయవాదుల హత్యకు రూ.2 కోట్ల సుపారీ ఇచ్చారనే లేఖ ఒకటి ఇటీవల రాష్ట్ర స్థాయి పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా చార్జీషీట్ దాఖలు కాకపోవడంతో.. కేసు మలుపు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈటల అనుచరుడికి బ్యాంకు నోటీసులు
కాగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టార్గెట్ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తొలుత ఆయన్ను మాత్రమే టార్గెట్ చేసి మాటల తూటాలను ఎక్కుపెట్టిన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అనంతరం కాస్త విరామం ఇచ్చి... ఈటల అనుచరులను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటల అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కెడీసీసీ బ్యాంక్ నోటీసులు పంపింది. సింగిల్ విండో ఛైర్మెన్‌గా ఉన్నప్పుడు నిధులు గోల్‌మాల్ చేశారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి!. మొత్తం 18 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని గురువారం నాడు బ్యాంకు నోటీసులు పంపింది. ఇదే క్రమంలో పుట్ట మధును సైతం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అదృశ్యమయ్యారనే ప్రచారం జోరుగా సాగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments