'ఛల్ మోహన్ రంగ' 'పెద్దపులి' సాంగ్ రిలీజ్

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ" అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం "ఛల్ మోహన్ రంగ"లో రీక్రియేట్ చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతిని, పెద్దమ్మ తల్లి గొప్పతనాన్ని చాటుతూ బోనాల సంబరాలలో పాడుకునే పాట "పెద్ద పులి". ఆ పాటని అంతే గొప్పగా, దాని స్థాయి ఏ మాత్రం తగ్గకుండా సంగీత దర్శకులు థమన్ మరియు సాహిత్య రచయిత సాహితి గారు చాలా జాగ్రత్తగా రీక్రియేట్ చేశారు.

పెద్ద పులి లాంటి పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే, అదీ తెలంగాణ వాస్తవ్యుడైన నితిన్ 25వ చిత్రం అయితే, దానికి థమన్ తన ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ తో దానిని వేరే స్థాయికి తీసుకుని వెళ్తే, వీటన్నిటికీ మించి ఆ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్ మాస్ స్టెప్స్ వేస్తే, ఇంకేముంది, థియేటర్లో ఫ్యాన్స్ కి సంబరాలే.....

సాహితి గారు అసలైన తెలంగాణ పదాలను వాడుతూ, పాటలో ప్రాస యాస ఏ మాత్రం తగ్గకుండా, వినడానికి పాడుకోవడానికి సులభంగా ఉండేలా వ్రాసారు.

ఈ మధ్యన ఫోక్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాహుల్ సిపిలిగంజ్ ఈ పాటని పాడారు. ఈ గీతం నిన్న రాత్రి వరంగల్ లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో యువత కేరింతలు,ఉత్సాహాల నడుమ విడుదల అయింది.

ఈ చిత్రానికి ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

More News

ఇక‌నైనా డిజిట‌ల్ ఛార్జీల త‌గ్గింపు పై ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకోవాలి- ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంద్ అనేది బ్ర‌హ్మాస్ర్తం లాంటిది. అలాంటి బ్ర‌హ్మాస్త్రాన్ని ఉప‌యోగించి తెలుగు ఫిలిం చాంబ‌ర్ వారు ఏం సాధించారో అర్థం కావ‌డంలేదు.

ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న నెల్లూరి పెద్దారెడ్డి...

సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

'రాజరథం' లో 'చల్ చల్ గుర్రం' అంటూ వస్తున్న రవి శంకర్

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే  నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో  మరోసారి ఆశ్చర్యపరచనుంది.

అనుకిది గుర్తుండిపోయే సంవ‌త్స‌ర‌మే..

ఫ‌లితాల‌ సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది కేర‌ళకుట్టి అను ఇమ్మాన్యుయేల్. 2016లో 'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ‌.. 2017లో 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'ఆక్సిజన్' సినిమాల్లో కథానాయికగా నటించింది.

శ‌ర్వానంద్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సీనియ‌ర్ న‌టి

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించిన 'విజయ' (త‌మిళంలో వ‌ల్లి) (1993)చిత్రంతో క‌థానాయిక‌గా పరిచయమయ్యారు ప్రియా రామన్. ఆ తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'శుభ సంకల్పం' (1995), శోభన్ బాబు సరసన 'దొరబాబు' (1995) చిత్రాల్లో నటించారు.