'పెదవి దాటని మాటొకటుంది' ట్రైలర్ లాంచ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిల్మ్ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం 'పెదవి దాటని మాటొకటుంది'. అదితి, టి.జి. కీర్తి కుమార్ నిర్మాతలు. టి.గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. రావన్ రెడ్డి, పాయల్ వాద్వా, డా. వి.కె.నరేశ్, మొయిన్, మౌరిస్ సడిచె, నందు కుమార్, మోహన్ భగత్, ప్రియాంక శుక్ల కీలక పాత్రధారులు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
దర్శకుడు . టి.గురుప్రసాద్ మాట్లాడుతూ "నేను మా వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నా. మా అమ్మ, మా అక్క మా తమ్ముడు నాకు చాలా సాయం చేశారు. ఇండస్ట్రీకి మీవాడు ఎందుకు వెళ్లాలి అని చాలా మంది అడిగినా, మావాళ్లు నన్ను వెనకేసుకుని వచ్చేశారు. నారాయణలో గోడలు దూకి సినిమాలు చూసే మేం ముగ్గురం (హీరో, సంగీత దర్శకుడు) ఈ సినిమా చేశాం.
నేను ఏం చెప్పినా మా వాళ్లు నమ్మి మాతో ఉన్నారు. మా నిర్మాతలు నాకు అమ్మానాన్నల్లాంటివారు. 30 రోజుల్లో సక్సెస్‌ఫుల్‌గా సినిమాను పూర్తి చేశాం. 75 సీన్లు, నాలుగు పాటలుంటాయి. ఇందులో నరేశ్‌గారి పాత్ర చాలా స్పెషల్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.
హీరోయిన్ పాయల్ వాద్వా మాట్లాడుతూ "మాది ఢిల్లీ. ఈ సినిమా యూనిట్ మొత్తం చాలా ఓపిగ్గా నాతో పనిచేయించుకున్నారు. మంచి సినిమా అవుతుంది" అని అన్నారు.
హీరో రావన్ రెడ్డి మాట్లాడుతూ "చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దర్శకుడు అంత కాన్ఫిడెంట్‌గా సినిమా చేశారు. దర్శకుడు మా ఫ్రెండ్ అనడం కన్నా.. తనకేం కావాలో తెలిసిన వ్యక్తి. కెమెరామేన్, ఎడిటర్... ఇలా అందరూ కలిసి ఈ సినిమా కోసం కృషి చేశారు. మా నిర్మాతలు మా కన్నా నన్ను ఎక్కువగా నమ్మారు. మేం అందరం కలిసి హిట్ సినిమాకు పనిచేశాం. నమ్మినదాన్ని జస్టిఫై చేశాం అనే నమ్మకం ఉంది" అని చెప్పారు.
నిర్మాత టి.జి . కీర్తి కుమార్ మాట్లాడుతూ "ఈ జెన్యూన్ టీమ్ చేసిన కృషి ఇది. ఐదేళ్లుగా మా టీమ్ అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఫాంటసీ రామ్ కామ్ సినిమా ఇది. సేమ్ టీమ్‌తో ఇంకో సినిమా చేస్తాం. త్వరలోనే ప్రారంభిస్తాం. ఇందులో మా దర్శకుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు" అని చెప్పారు.
నిర్మాత అదితి మాట్లాడుతూ "ఫ్యామిలీలాగా అందరం కలిసి పనిచేశాం. ఏడాది కష్టపడి చేసిన సినిమా ఇది" అని అన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ "హీరో, నేను, దర్శకుడు నెల్లూరు నుంచి ఫ్రెండ్స్. కలిసి ఈ సినిమా చేశాం. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని తెలిపారు.
రావన్ రెడ్డి, పాయల్ వాద్వా, డా. వి.కె.నరేశ్, మొయిన్, మౌరిస్ సడిచె, నందు కుమార్, మోహన్ భగత్, ప్రియాంక శుక్ల, శుభమ్ శైనీ, అంజు నాయర్, అనుసా శ్రీరాముల, ప్రజ్వల్ ప్రిన్స్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: టి.జి.కీర్తికుమార్, నృత్యాలు: నామన్ - యతిన్, సంగీతం: జీనిత్ రెడ్డి, ఎడిటర్: నిర్మల్ కుమార్, ప్రొడక్షన్ డిజైన్: అదితి, కాస్ట్యూమ్స్: అదితి, శివప్రియ చౌదరి, నృత్యాలు: టి.జి.కీర్తి కుమార్, లిరిక్స్: రెహమాన్, మధునందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పార్తిబన్.ఎం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments