'పీన‌ట్ డైమండ్' చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,October 10 2020]

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంలో  అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం 'పీన‌ట్ డైమండ్'. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. 'బెంగాల్ టైగ‌ర్' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఒక డిఫ‌రెంట్ సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఈరోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా.. నిర్మాత‌లు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ - '' రెండు కాల‌మాణాల‌కి సంబందించిన ఒక విభిన్న క‌థాంశంతో అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకునేవిధంగా ఈ మూవీ రూపొందుతోంది. 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతూ ఉంటుంది. ఆ రెండు క‌థ‌ల‌కి సంభందం ఏంటి? అలాగే పీన‌ట్ డైమండ్ అని విభిన్న‌మైన టైటిల్ ఎందు‌కు పెట్టాం? అనే విష‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి.  ఖ‌చ్చితంగా ఆడియ‌న్స్‌కి ఒక మంచి అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది.   ఈ చిత్రానికి సంబందించి మొద‌టి షెడ్యూల్ ఈ రోజు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. మిగిలిన రెండు షెడ్యూల్స్ త‌మిళ‌నాడు, కేర‌ళ‌, వైజాగ్ లో జ‌రుప‌నున్నాం.  మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం.'' అన్నారు.

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.

More News

దిశ సినిమాపై కోర్టులో పిటిషన్‌... స్పందించిన నట్టికుమార్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్‌కౌంటర్‌'. గత ఏడాది నవంబర్‌ 26న దిశపై జరిగిన అత్యాచారం, హత్య...

విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ షాక్‌

హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ శుక్రవారం పెద్ద షాకే ఇచ్చింది. వివరాల్లోకెళ్తే... విశాల్‌, సుందర్‌.సి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'యాక్షన్‌'.ఈ సినిమా విడుదల సమయంలో

సూసైడ్ చేసుకోవాలనుకున్నానన్న అవినాష్.. మోనాల్‌పై నమ్మకం లేదన్న అఖిల్

ఇవాళ షో మొత్తాన్ని అవినాష్ కంప్లీట్‌గా హ్యాండోవర్ చేసుకున్నాడు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ అవినాష్‌కే దక్కింది. చూసే వాళ్లకే కాదు.. కంటెస్టెంట్లలో కూడా మంచి జోష్‌ని నింపాడు. ఇక షో విషయానికి వస్తే..

అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.