Chhattisgarh and Mizoram:ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ప్రశాంతం కొనసాగుతోన్న పోలింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత..
ఇక నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. తొలిదశలో భాగంగా 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.
కాగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా.. మళ్లీ ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తెలిపాయి. అయితే అయితే బీజేపీ కూడా అధికారంలోకి రావడానికి గట్టి పోటీ ఇస్తుంది. దీంతో అక్కడ హోరాహోరి పోరు జరగనుంది. ఇక మిజోరంలో ప్రాంతీయ పార్టీ మిజోరం నేషనల్ ఫ్రంట్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments