Chhattisgarh and Mizoram:ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ప్రశాంతం కొనసాగుతోన్న పోలింగ్..

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ భద్రత..

ఇక నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. తొలిదశలో భాగంగా 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.

కాగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా.. మళ్లీ ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తెలిపాయి. అయితే అయితే బీజేపీ కూడా అధికారంలోకి రావడానికి గట్టి పోటీ ఇస్తుంది. దీంతో అక్కడ హోరాహోరి పోరు జరగనుంది. ఇక మిజోరంలో ప్రాంతీయ పార్టీ మిజోరం నేషనల్ ఫ్రంట్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నాయి.

More News

Prime Minister Modi :హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పోటాపోటీ ప్రచారాలతో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి.

BRS MLC Kalvakuntla:రష్మిక డీప్ ఫేక్ వీడియో వ్యవహారం : కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి, మహిళలను కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి

టాలీవుడ్ అగ్రకథానాయిక, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Rashmika:రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఏమన్నారంటే..?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్నాయి. పోలింగ్‌కు మరో 22 రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

KCR: కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తొమ్మిదేన్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించారు.