పీఏసీ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత..
Send us your feedback to audioarticles@vaarta.com
అనంతంపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు అమరావతిలో జరిగిన పీఏసీ భేటీకి పయ్యావుల హాజరయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఈ వార్త విన్న తెలుగు తమ్ముళ్లు.. పయ్యావుల వీరాభిమానుల్లో టెన్షన్ మొదలలైంది. సమావేశంలో ఇలా జరిగిందని తెలుసుకున్న తోటి తెలుగు తమ్ముళ్లు హుటాహుటిన స్థానికంగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూయన మేరకు విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.
పూర్తి వివరాల్లోకెళితే.. ఇవాళ పీఏసీ సమావేశం జరుగుతుండగా మధ్యలో పయ్యావులకు వాంతులయ్యాయి. దీంతో వెంటనే అసెంబ్లీ డిస్పెన్సరీలో చికిత్స అందజేశారు. స్వల్ప అస్వస్థతేనని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా.. పయ్యావుల.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి ఆప్తుడు అనే విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే.. వైఎస్సార్సీపీ నేత విశ్వేశ్వరరెడ్డిని ఓడించి పయ్యావులు గెలుపొందారు. అయితే ఆ తర్వాత పయ్యావుల రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout