పాయల్ స్పెషల్ రెట్రో లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం ఆర్.ఎక్స్ 100తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ ఏ సినిమాను పడితే ఆ సినిమాను చేయకూడదని సెలక్టివ్‌గానే సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది. ఒక పక్క ఆర్‌డీఎక్స్ లవ్ అనే ఉమెన్ సెంట్రిక్ మూవీతో పాటు వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ముందుగా ఆర్‌డీఎక్స్ లవ్ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా పాయల్‌కు ఉన్న పేరు చెడగొట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మడు ఉన్న ఇమేజ్ పోయిందేమిట్రా అని తల పట్టుకుందట. అయితే ఇప్పుడు డిసెంబర్ 13న విడుదలయ్యే వెంకీమామ, వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కాబోయే డిస్కోరాజా చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది.
తాజాగా డిస్కోరాజాకు సంబంధించిన ఇన్‌టెన్సివ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెట్రో బ్యాక్‌డ్రాప్ స్టైల్లో పాయల్ రాజ్‌పుత్ గన్ పట్టుకుని ఉంది. మరి ఈమె గన్ను ఎవరికి ఎక్కు పెట్టిందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 1980 నేపథ్యంలో రూపొందుతోన్న డిస్కోరాజా చిత్రాన్ని వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. రవితేజ హృరోగా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బాబీ సింహ విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com