Rakshana: పాయల్ రాజ్‌పుత్ ‘రక్షణ’...టైటిల్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘రక్షణ’. రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించబోతున్నారు. ఈ మూవీ శరవేగంగా రూపొందుతోంది.
హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ మెప్పించబోతున్నారు. ఈ సందర్భంగా...
దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘రక్షణ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com