సందడంతా పాయల్ దే!
Send us your feedback to audioarticles@vaarta.com
`ఆర్ ఎక్స్ 100` బండిలా తెలుగు తెరపైకి దూసుకొచ్చిన ఉత్తరాది సోయగం పాయల్ రాజ్ పుత్. డెబ్యూ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్.. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. `ఆర్ ఎక్స్ 100` తరువాత `యన్టీఆర్ కథానాయకుడు` (అతిథి పాత్ర), `సీత` (స్పెషల్ సాంగ్)లో మెరిసిన పాయల్.. `ఆర్డీఎక్స్ లవ్` కోసం మళ్ళీ పూర్తిస్థాయి కథానాయిక పాత్రలో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో పాయల్ గ్లామర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ నెల 11న వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో పాయల్.. మరోసారి యూత్‌ని మెస్మరైజ్ చేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే... 2019 చివరి మూడు నెలల్లో సందడంతా పాయల్ దే కానుంది. ఎందుకంటే.. పాయల్ నాయికగా మూడు సినిమాలు వెండితెరపై వెలుగులు పంచనున్నాయి. అక్టోబర్ 11న `ఆర్డీఎక్స్ లవ్` రిలీజ్ కానుండగా... డిసెంబర్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌కి జోడీగా నటించిన `వెంకీమామ`, మాస్ మహారాజా రవితేజ సరసన ఆడిపాడిన `డిస్కోరాజా` విడుదల కాబోతున్నాయి. మరి.. ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో పాయల్ నటించిన ఈ మూడు సినిమాలు తన కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com