స్టార్ హీరో సినిమాలో హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్

  • IndiaGlitz, [Friday,March 20 2020]

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో కుర్ర కారు మనసులను కొల్లగొట్టిన పాయల్ రాజ్‌పుత్‌కి క్రేజ్ పెరిగింది. నిర్మాత‌లు ఆమెతో సినిమాలు చేయ‌డానికి క్యూ క‌ట్టారు. అయితే ఆమె ప‌రిమితంగానే సినిమాల‌ను ఎంచుకుంది. వెంకీమామ సినిమా కూడా మంచి విజ‌యాన్ని సాధించింది. అదే స‌మ‌యంలో ఈ అమ్మ‌డు కాస్త బోల్డ్‌గా న‌టించిన ఆర్‌.డి.ఎక్స్ ల‌వ్ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో పాయ‌ల్‌కు ఉన్న క్రేజ్ పోయింది. త‌ర్వాత వ‌చ్చిన డిస్కోరాజాలో పెద్ద పాత్రే ద‌క్కినా.. దాన్ని చ‌క్క‌గా మ‌ల‌చ‌క‌పోవ‌డం.. సినిమా విజయం సాధించ‌క‌పోవ‌డం వ‌టి కార‌ణాల‌తో పాయ‌ల్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

దీంతో పాయ‌ల్ చేతిలో సినిమాలు లేకుండా పోయిన అదే సమ‌యంలో ఓ స్టార్ హీరో సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు.. నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిక‌గా పాయ‌ల్ క‌న‌ప‌డుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో అంజ‌లి, శ్రియ హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రి స్థానంలో పాయ‌ల్ న‌టిస్తుందో చూడాలి.