తమిళంలో పాయల్ స్టార్ట్ చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం `ఆర్.ఎక్స్ 100` చిత్రంలో గ్లామర్‌తోనే కాదు.. పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తెలుగులో భాను శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతుంది. తెలుగులో ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యిందో లేక.. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉంటుందో కానీ తెలియడం లేదు.
ఈ విషయాన్ని పక్కన పెడితే..తమిళంలో మాత్రం తన తదుపరి సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని పాయల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రూపొందబోయే చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్లే.. తమిళ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది పాయల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments