‘పుష్ప’ కోసం పాయల్ స్పెషల్?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి తెలుగు చిత్రం ‘ఆర్.ఎక్స్100’తో హాట్ బ్యూటీ ఇమేజ్ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు తర్వాత చేసిన ఆర్.డి.ఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కోరాజా చిత్రాలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఈమెకు పెద్దగా అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌లో నటించనుందట. అయితే పాయల్‌కు స్పెల్సాంగ్లో నటించడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ నటించిన ‘సీత’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఇప్పుడు మరోసారి పాయల్ స్పెషల్ సాంగ్‌తో మెరనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలపై పాయల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇక ‘పుష్ప’ విషయానికి వస్తే.. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ‘పుష్ప’ చిత్రాన్ని మారేడు మిల్లి అడవుల్లో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత బన్నీ, సుక్కు కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. అది కూడా పాన్ ఇండియా రేంజ్లో రానుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments