మీటూ గురించి సంచలన ఆరోపణలు చేసిన పాయల్ రాజ్‌పుత్
Send us your feedback to audioarticles@vaarta.com
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్లో మొదలైన మీటూ ఉద్యమం క్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టింది. చాలా మంది సినిమా పరిశ్రమకు చెందినవారు తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాల గురించి ట్విట్టర్ ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఉద్యమం ఓ రేంజ్లో జరిగింది. ఈ ఉద్యమం కారణంగా కొన్ని మంచి పరిణామాలు జరిగినా.. పెద్దగా ఫలితం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇదే విషయాన్ని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చెప్పుకుంది. ఇంటర్వ్యూలో పాయల్ రాజ్‌పుత్ మీటూ ఉద్యమం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హిందీలో సీరియల్స్, పంజాబీలో సినిమాలు చేసేటప్పుడు.. అలాగే తెలుగులో ఆర్.ఎక్స్ 100 తర్వాత కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పింది. అవకాశాల పేరుతో కోరికలు తీర్చమని చాలా మంది అడిగారని, భవిష్యత్‌లోనూ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయోమనని చెప్పుకొచ్చింది. మీటూ ఉద్యమం జరిగినప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఏమాత్రం తగ్గలేదని ఆమె తెలిపారు. ఆర్.ఎక్స్ 100లో తాను బోల్డ్‌గా నటించానని అంత మాత్రాన.. తాను అలానే ఉంటానని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించింది. అవకాశాల కోసం తాను కోరికలు తీర్చే రకం కాదని.. రాజీ పడనని చెప్పిన పాయల్ రాజ్‌పుత్.. ఇతర రంగాల్లోనూ వేధింపులు ఉన్నాయని, ఇంత ధైర్యంగా మాట్లాడటం వల్ల కొందరు తనను ద్వేషిస్తున్నారని కూడా తెలిపింది. ప్రస్తుతం వెంకటేశ్ సరసన వెంకీమామలో నటిస్తున్న పాయల్ రాజ్‌పుత్.. ఆర్.డి.ఎక్స్ లవ్ అనే చిత్రంలోనూ నటించింది. ఈ సినిమా టీజర్ గురువారం విడుదలై వన్ మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెళ్లికి ముందు సెక్స్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా అని తెలుస్తుంది. తేజస్ కంచర్ల హీరోగా నటించాడు. టీజర్ మాత్రం చాలా బోల్డ్‌గా అనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments