Rakshana: పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' జూన్ 7న గ్రాండ్ రిలీజ్

  • IndiaGlitz, [Monday,May 27 2024]

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం మెప్పించ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇదొక ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను జూన్ 7న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

More News

Pune Car Incident: పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలో డ్రంకన్ డ్రైవ్ కారు కేసులో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుంది. థ్రిల్లర్ మూవీలను మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.

MLC Elections: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రలోభాలు.. స్వతంత్ర అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి!

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు.

Amit Shah: ఏపీలో కూటమిదే అధికారం.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన అమిత్ షా

ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ జరగనుండగా.. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు, నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Seethakka: టీపీసీసీ చీఫ్ రేసులో సీతక్క.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చొబెట్టింది. ఆయన సారథ్యంలోనే పార్లమెంట్

JD Lakshminarayana: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలి.. జేడీ డిమాండ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం ఈ ఏడాది జూన్ రెండో తేదీతో ముగుస్తుంది.