హాట్ ఫోటోస్: దివి నుంచి దిగివచ్చిన దేవతలా పాయల్ హొయలు

  • IndiaGlitz, [Saturday,July 03 2021]

పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రోల్ తో యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో పాయల్ పెర్ఫామెన్స్, గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కూడా పాయల్ రాజ్ పుత్ తన గ్లామర్ షో కొనసాగిస్తూనే ఉంది.

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ కు అంతటి సాలిడ్ హిట్ లభించలేదు. వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ సరసన, డిస్కో రాజాలో రవితేజకు జోడిగా నటించినా ఆ చిత్రాలు ఆశించిన క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయాయి. సీత చిత్రంలో పాయల్ బుల్ రెడ్డి అంటూ స్పెషల్ సాంగ్ కూడా చేసింది.

డిస్కో రాజా తర్వాత పాయల్ కు మరో తెలుగు మూవీలో ఛాన్స్ లభించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన గ్లామర్ పిక్స్ తో యువతని సమ్మోహనపరుస్తోంది. తాజాగా పాయల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ లో ఆమె అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే.

గ్రీన్ డిజైన్ ఉన్న అవుట్ ఫిట్ లో పాయల్ దివి నుంచి దిగివచ్చిన దేవతలా హొయలు ఒలికిస్తోంది. అందాల దేవతని తలపిస్తున్న పాయల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.