చిత్ర పరిశ్రమలోనూ చీకటి కోణం ఉంది: పాయల్ రాజ్‌పుత్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడంటూ విమర్శలు చేలరేగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెపోటిజంను దయ్యబట్టింది. ‘నా మదిలో ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకోవడం మాత్రం పరిష్కారం కాదు. చిత్రసీమలోనూ చీకటి కోణం ఉంది. మొదటిది నెపోటిజం..ఇది బాలీవుడ్ నరనరాల్లో ఇంకిపోయింది. ఇక రెండోది అదృష్టం అనే పేరు పెడతారు. మూడోది అభద్రతా భావం కలిగిస్తారు.
బాలీవుడ్ వారు నన్ను కూడా దూరం పెట్టారు. నా స్థానంలో మరొకరిని తీసుకున్నప్పుడు నా గుండె పగిలింది. అయితే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు. మీ మనసులో మాటలు, మీ కష్టాలను ఇతరులతో పంచుకోండి. జీవితం ఎంతో ఆమూల్యమైనది. మధ్యలో దాన్ని వదిలేయకండి. కొన్నిసార్లు పరిస్థితులు బాగోవు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. బాధల్లో కొందరు అంతా బావుందని అంటుంటారు. ఎందుకలా మీ పరిస్థితి బాగోలేదనే చెప్పంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. ప్రపంచంలో ఏ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. ఒకవేళ అలా ఉంటే అతను మనిషే కాడు’’ అని తెలిపారు పాయల్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments