చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ చీక‌టి కోణం ఉంది:  పాయ‌ల్ రాజ్‌పుత్‌

  • IndiaGlitz, [Tuesday,June 16 2020]

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌తో బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ చ‌నిపోయాడంటూ విమర్శ‌లు చేల‌రేగుతున్నాయి. ఈ క్ర‌మంలో టాలీవుడ్ హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా నెపోటిజంను ద‌య్య‌బట్టింది. ‘నా మదిలో ఎన్నో ఆలోచ‌న‌లు ప‌రుగులు తీస్తున్నాయి. ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం మాత్రం ప‌రిష్కారం కాదు. చిత్ర‌సీమ‌లోనూ చీక‌టి కోణం ఉంది. మొద‌టిది నెపోటిజం..ఇది బాలీవుడ్ న‌ర‌నరాల్లో ఇంకిపోయింది. ఇక రెండోది అదృష్టం అనే పేరు పెడ‌తారు. మూడోది అభ‌ద్ర‌తా భావం క‌లిగిస్తారు.

బాలీవుడ్ వారు న‌న్ను కూడా దూరం పెట్టారు. నా స్థానంలో మ‌రొక‌రిని తీసుకున్న‌ప్పుడు నా గుండె ప‌గిలింది. అయితే నేను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకోలేదు. మీ మ‌న‌సులో మాట‌లు, మీ క‌ష్టాల‌ను ఇతరుల‌తో పంచుకోండి. జీవితం ఎంతో ఆమూల్య‌మైనది. మ‌ధ్య‌లో దాన్ని వ‌దిలేయ‌కండి. కొన్నిసార్లు ప‌రిస్థితులు బాగోవు. జీవితంలో ఎత్తుప‌ల్లాలు స‌హ‌జం. బాధ‌ల్లో కొంద‌రు అంతా బావుంద‌ని అంటుంటారు. ఎందుక‌లా మీ ప‌రిస్థితి బాగోలేద‌నే చెప్పంది. కుటుంబ స‌భ్యుల‌తో స‌మ‌యాన్ని గ‌డ‌పండి. ప్ర‌పంచంలో ఏ వ్య‌క్తి ఎప్పుడూ సంతోషంగా ఉండ‌లేడు. ఒక‌వేళ అలా ఉంటే అత‌ను మ‌నిషే కాడు’’ అని తెలిపారు పాయల్

More News

కరోనా పాటల ఆల్బమ్ ను ఆవిష్కరించిన వి .వి .వినాయక్

కరోనా రక్కసి కరాళ  నృత్యాన్ని చూసి  ప్రపంచ పటమే  భయంతో  వణికి  పోతున్న  నేపధ్యంలో  ప్రజలను చైతన్యం  చేసే లక్ష్యంతో  రూపొందిన  " కరోనా రక్కసి "

గోపీచంద్‌తో మ‌రో స్టార్ హీరోయిన్‌..?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి  ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు.

అబ్బాయ్ త‌ర్వాత బాబాయ్‌తో ....

యువ క‌థానాయ‌కుడు న‌వీన్‌చంద్ర కేవ‌లం హీరోగానే కాకుండా కీల‌క‌మైన పాత్ర‌ల్లోనూ న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాడు.

రెమ్యున‌రేష‌న్స్ విష‌యంలో కీర్తి ఆలోచ‌న‌

కరోనా ప్రభావంతో చాలా రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది.

40 ఏళ్లలో తొలిసారి.. ఆస్కార్స్ వాయిదా

ప్రపంచ సినిమాలో ఆస్కార్ అవార్డుల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఈ అవార్డుల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంటారు.