దర్శకుడిని తప్పు పడుతున్న పాయల్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం ఆర్.ఎక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్‌పుత్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హాట్ అందచందాలతో కుర్రకారుకి దగ్గరైన పాయల్ రాజ్‌పుత్ ‘వెంకీమామ’ చిత్రంలో వెంకటేశ్ జతగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాయల్ తన పాత్రను డిజైన్ చేసినట్లు తీరుపై అసంతృప్తిగా ఉందట. వెంకీమామలో పాయల్ టీచర్ పాత్రలో నటించింది. ఈ పాత్రను డైరెక్టర్ బాబీ అంటీ పాత్రలా చూపించాడని సన్నిహితుల దగ్గర పాయల్ బాధపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రీసెంట్గా బాలకృష్ణ 106వ చిత్రంలో పాయల్ నటిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే ఆ వార్తలను పాయల్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆమెపై వస్తున్న పుకార్లపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. వెంకీమామలో పాత్ర పరంగా చూస్తే పాయల్‌కు మంచి ప్రాధాన్యతే దక్కినప్పటికీ వెంకటేశ్ సరసన ఆమె పాత్రను బాబీ డిజైన్ చేసిన తీరు నచ్చలేదట. ఎఫ్ 2లో తమన్నా కూడా వెంకటేశ్ సరసన నటించినా..ఆమె పాత్రను దర్శకుడు అనిల్ చక్కగానే చూపించాడట. కానీ బాబీ అలా చూపించడం లేదని బాధపడుతుందట. ఏదేమైనా ఇప్పుడు పాయల్‌ను పట్టించుకునేవారే లేకపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com