క్లారిటీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి తెలుగు చిత్రం ‘ఆర్.ఎక్స్100’తో హాట్ బ్యూటీ ఇమేజ్ను సొంతం చేసుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు తర్వాత చేసిన ‘ఆర్.డి.ఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కోరాజా’ చిత్రాలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఈమెకు పెద్దగా అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. అయితే రీసెంట్గా ఈమె రెండు భారీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించనుందంటూ వార్తలు వినిపించాయి. బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’, కమల్ మరియు శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్ 2’లోనూ పాయల్ ప్రత్యేక గీతాల్లో నర్తించనుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ వార్తలకు పాయల్ రాజ్‌పుత్ క్లారిటీ ఇచ్చారు. తాను ‘ఇండియన్ 2, పుష్ప’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించడం లేదన్నారు పాయల్. ‘ఇప్పుడు నేను ఏ సినిమాలో నటించడం లేదు. కొత్త చిత్రాలను ఒప్పుకోలేదు. కొత్త కథలు చదువుతున్నాను. కంటెంట్ ఉన్న చిత్రాల్లోనటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ ఏదైనా కొత్త చిత్రానికి ఓకే చెబితే తప్పకుండా అందరికీ చెబుతాను’ అని తెలిపారు పాయల్ రాజ్‌పుత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com