జనవరిలో పాయల్ రాజ్‌పుత్ '5Ws' విడుదల!

  • IndiaGlitz, [Monday,December 21 2020]

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '5Ws - who, what, when, where, why' (5 డబ్ల్యూస్ - ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు... అనేది ఉపశీర్షిక. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రణదీప్ ఠాకోర్, యశోదా ఠాకోర్ మాట్లాడుతూ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు పేరు తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

More News

పవన్ కళ్యాణ్ - రాణా దగ్గుబాటి  కాంబినేషన్ చిత్రం ప్రారంభం

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం నేడు ప్రారంభమయింది.

రాజేంద్ర ప్ర‌సాద్‌, జ‌య‌ప్ర‌ద ప్రేమ‌లో ప‌డితే...!

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌య‌ప్ర‌ద‌.. ఈ సీనియ‌ర్ స్టార్స్ ప్రేమ‌లోప‌డ‌ట‌మేంట‌ని అనుకుంటున్నారా?  లేటు వ‌య‌సులోఘాటు ల‌వ్ ఏంట‌ని భావిస్తున్నారా?

నాని 27.. ‘శ్యామ్ సింగ‌రాయ్’ షూటింగ్ షురూ

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో

కొన‌సాగుతున్న ‘వ‌కీల్‌సాబ్’ లీకుల ప‌ర్వం

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మాత‌లు.

ఏపీ ప్ర‌భుత్వ తీరుపై సి.క‌ల్యాణ్ అభ్యంత‌రం

కోవిడ్ ప్ర‌భావంతో దేశ‌మంత‌టా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీలో షూటింగ్స్ ఆగిపోయాయి.