అనురాగ్‌పై కేసు ఫైల్ చేసిన పాయ‌ల్‌

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ ఇప్పుడు ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లోకేసు న‌మోదు చేశారు. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదును పోలీసులు ఫైల్ చేశారు. లాయ‌ర్ సాత్నుటేతో క‌లిసి పాయ‌ల్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 376ఐ, 354, 341, 342, అనురాగ్‌పై కేసు న‌మోదైంది. ఏడేళ్ల క్రితం వెర్సోవాలోని యారి రోడ్డులో క‌శ్య‌ప్ త‌న‌పై బ‌లాత్కార ప్ర‌య‌త్నం చేశాడ‌ని పాయ‌ల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును స్వీక‌రించిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తును చేయ‌బోతున్నారు.

అనురాగ్ క‌శ్య‌ప్ ఇంటికెళ్లినప్పుడు త‌న‌ను బలాత్కారం చేయ‌బోయాడ‌ని, త‌న‌కు రిచాచ‌ద్దా, మ‌హిగిల్‌, హూమా ఖురేషిల‌తో సంబంధం ఉన్న‌ట్లు చెప్పుకొన్నాడంటూ ఓ వీడియో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే పాయ‌ల్ వీడియో విడుద‌లైన త‌ర్వాత అనురాగ్ క‌శ్య‌ప్‌కు సినీ ఇండ‌స్ట్రీ నుండి మ‌ద్ద‌తు పెరిగింది. మాజీ భార్య క‌ల్కికొచ్లిన్ స‌హా ఎక్కువ మంది ప్ర‌ముఖులంద‌రూ అనురాగ్‌కే స‌పోర్ట్ చేశారు. కంగనార‌నౌత్‌, మ‌రికొంత మంది ట్విట్ట‌ర్ వేదిక‌గా అనురాగ్‌ను ద‌య్య‌బ‌ట్టారు. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన అనురాగ్ నిరాధార ఆరోప‌ణ‌లంటూ కొట్టిపారేశాడు. మ‌రి పాయ‌ల్ ఘోష్‌పై అనురాగ్ ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటాడేమో చూడాలి.