నిరంతరం తపన పడేవారి కోసం పవన్ అందిస్తున్న కానుక
Send us your feedback to audioarticles@vaarta.com
గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన మహా గ్రంధం ఆధునిక మహా భారతం. ఈ పుస్తకం గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కు చెప్పడం... త్రివిక్రమ్ చెప్పడంతో పవన్ ఆధునిక మహా భారతం పుస్తకాన్ని చదవడం జరిగింది. అయితే... ఈ గొప్ప పుస్తకం పవన్ కి తెగ నచ్చేసింది. ఎంతలా నచ్చింది అంటే....ప్రస్తుతం మార్కెట్ లో ఈ పుస్తకం అందుబాటులో లేకపోవడంతో నేటి యువతకు ఈ మహా గ్రంధం అవసరం ఎంతైనా ఉందని భావించి పవన్ తన ఖర్చులతో ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయిస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ...ఈ దేపు సంపద ఖనిజాలు కాదు...నదులు కాదు..అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలలో చేసిన యువత మన దేశ భవిష్యత్ కు నావికులు అన్న మహా కవి శేషంద్ర గారి మాటలు ఆయనంటే అమితంగా ఇష్టపడేలా చేసాయి. నీలో సాహసం ఉంటే...దేశంలో అంధకారం ఉంటుందా..? అని ఆయన వేసిన ప్రశ్న నాకు మహా వాక్యం అయ్యింది. నాకు అత్యంత ప్రీతి పాత్రమయిన ఆధునిక మహా భారతం అనే ఈ మహా గ్రంధాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కో్సం నిరంతరం తపన పడే వారి కోసం అందుబాటులో ఉంచాలన్న నా ఆకాంక్ష. ఈ మహా గ్రంధాన్ని ఇంకోసారి ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన మహా కవి శేషంద్ర గారి అబ్బాయి కవి అయిన సాత్యకి గారికి నాకీ మహాకవిని పరిచయం చేసిన నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout