అమెరికాలో ప‌వ‌నిజం

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్ర‌ధాన న‌గ‌రాలైన సిలికాన్ వ్యాలీ, లాస్ ఏంజిల్స్, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, చికాగోల్లో అక్టోబర్ 11న పవనిజం సెలబ్రేషన్స్ జరిపేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 22న అభిమానులు సమావేశమై పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి మద్దతుగా ప‌వ‌నిజం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే అక్టోబర్ 11 నే ప‌వ‌నిజం డే నిర్వ‌హించ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. అదేమిటంటే...పవన్ కళ్యాన్ న‌టించిన తొలి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి అక్టోబర్ 11న విడుదలైంది. అందుక‌నే అక్టోబ‌ర్ 11 ని ప‌వ‌నిజం డే గా ఫిక్స్ చేసార‌ట ప‌వ‌న్ ఫ్యాన్స్.

గ‌తంలో.. ప‌వ‌న్ ని ప‌వ‌నిజం గురించి అడిగితే..ఫ్యాన్స్ నాకోసం డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి ఫంక్ష‌న్స్ చేయ‌న‌వ‌స‌రం లేదు. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌గా ఉంటూ తోటివారికి చేత‌నైనంత సాయం చేస్తే చాలు అన్నారు. మ‌రి...ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఖ‌ర్చు పెట్టి విదేశాల్లో ప‌వ‌నిజం డే గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తున్నారు. మ‌రి ప‌వ‌నిజం సెల‌బ్రేష‌న్స్ పై ప‌వ‌న్ స్పంద‌న ఏమిటో..?