నాన్నకు ప్రేమతో..రిలీజ్ కి అడ్డుపడుతున్న పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ చేస్తున్నారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా నాన్నకు ప్రేమతో...సినిమాని రిలీజ్ చేస్తున్న సమయంలో ఊహించని విధంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైట్ చేయడం విశేషం.
ఇంతకీ పవన్ ఎందుకు ఫిర్యాదు చేసారంటే..అత్తారింటికి దారేది సినిమా టైంలో పవన్ కి రెమ్యూనరేషన్ లో భాగంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ రెండు కోట్లు బాకీ ఉన్నారట. నాన్నకు ప్రేమతో...రిలీజ్ టైంలో ఇస్తానని పవన్ కి మాట ఇచ్చారట. ఇప్పటి వరకు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ రెండు కోట్లు ఇవ్వకపోవడంతో అసోషియేషన్ లో ఫిర్యాదు చేసారు పవన్. ఫిర్యాదు స్వీకరించిన అసోసియేషన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఈ ఫిర్యాదును పంపించింది. అయితే నాన్నకు ప్రేమతో..రేపు రిలీజ్ అనగా ఈరోజు ఇలా జరగడంతో...రేపు నాన్నకు ప్రేమతో...రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సమస్యను పరిష్కరించి అనుకున్న విధంగా నాన్నకు ప్రేమతో..చిత్రాన్ని రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com