పవన్ వచ్చేశాడు...

  • IndiaGlitz, [Sunday,January 24 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. రీసెంట్‌గా ప‌వ‌న్ కాలికి గాయం కావ‌డంతో డాక్ట‌ర్స్ వారం రోజుల పాటు రెస్ట్‌ను సూచించారు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ప‌వ‌న్ కాలిగాయం ఓకే అయింద‌ని ఈరోజు నుండి షూట్‌లో పాల్గొంటున్నాడ‌నేది స‌మాచారం.