పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా  'ఈ కథలో పాత్రలు కల్పితం'

  • IndiaGlitz, [Monday,January 13 2020]

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఈ చిత్రంలో మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. 'ఆర్‌ఎక్స్‌ 100', 'కల్కి' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్‌ రాసిన తాజుద్దీన్‌ సయ్యద్‌ ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తుండటం సినిమాపై పాజిటివ్‌ బజ్‌ నెలకొని ఉంది. అలాగే 'జెస్సీ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన సునీల్‌ కుమార్‌ ఎన్‌ ఈ సినిమాకి బ్యూటిఫుల్‌ విజువల్స్‌ అందిస్తున్నారు.