వాటినే టార్గెట్ చేసుకుంటున్న పవన్
- IndiaGlitz, [Friday,August 18 2017]
సినిమా సక్సెస్ కావడానికి సీజన్‌తో పని లేదన్నది పాత మాట. ఇప్పుడు వసూళ్లు ఇంకా బాగా రావాలంటే సీజన్స్నే నమ్ముకోక తప్పడం లేదు ఎంత పెద్ద స్టార్ అయినా. గత రెండు మూడేళ్లుగా సంక్రాంతి, సమ్మర్, దసరా టైంలో కనిపిస్తున్న సందడి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
గత కొంత కాలంగా పవన్ వరుస చిత్రాలు పండగ టైంలోనే విడుదల అవుతున్నాయి. 2015 సంక్రాంతికి గోపాల గోపాల, 2016 ఉగాదికి సర్దార్ గబ్బర్‌సింగ్, 2017 ఉగాదికి కాటమరాయుడు చిత్రాలతో సందడి చేసిన పవన్.. 2018 సంక్రాంతికి త్రివిక్రమ్‌తో చేస్తున్న కొత్త చిత్రంతో సందడి చేయనున్నాడు. అంటే తన వరుస నాలుగు చిత్రాలను పండగ టైంలోనే పవన్ టార్గెట్ చేసుకున్నాడన్నమాట.