Pawan:కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం అలాగే కూలిపోతుంది: పవన్

  • IndiaGlitz, [Friday,February 16 2024]

కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది అని జనసేనాని తెలిపారు. విజయవాడలో విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నాను. వైసీపీ వ్యతిరేక ఓటు ఎందుకు చీలనీవ్వకూడదన్నానో దానికి అర్థం ఈ పుస్తకం. ప్రతిపక్షాలు ఎందుకు కలవాలి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకు చీలకూడదు? విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పార్టీలు ప్రజల పక్షాన ఎందుకు నిలవాలి? అన్న ప్రశ్నలకు విధ్వంసం పుస్తకంతో జవాబు దొరుకుతుందన్నారు. ఈ పుస్తకాన్ని ఏ రాజకీయ పార్టీకి మద్దతుగానో... మరేదో పార్టీకి వ్యతిరేకంగానో రాయలేదని... ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో అదే రాశారు అని తెలిపారు.

అమరావతి రైతుల మీద పడ్డ దెబ్బలు చూసి గుండె చెదిరింది... ఆడపడుచులపై అఘాయిత్యాలు తనను చాలా బాధించాయని చెప్పారు. త్వరలోనే ఎన్నికలు వున్నాయి కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఉన్నామని.. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన మొదట్లో వారి దాష్టికాలను తట్టుకోగలమా అని భయమేసిందన్నారు. ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధితులుగా మారారు... వారు అనుభవించిన బాధలనే విధ్వంసం పుస్తకంలో పొందుపర్చారని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు రచయితగా మారితే ఎలా ఉంటుందో ఈ పుస్తకం తెలియజేస్తుందని... ఇది పాలకులకు హెచ్చరిక అన్నారు.

ఇక వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వక్రీకరించిందన్నారు. వాలంటీర్లే రాష్ట్రంలోని మహిళల అదృశ్యానికి కారణమని తాను అనలేదని.. వీరి ద్వారా ప్రభుత్వం డేటాను సేకరించి ఎవరి చేతికో ఇచ్చిందని అన్నట్లు గుర్తుచేశారు. అలాగే కొందరు వాలంటీర్లు చేసే పనులు మొత్తం వాలంటీర్ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తోందని హెచ్చరించానన్నారు. రాష్ట్రంలో 33 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని చెబితే ప్రభుత్వం పట్టించుకోలేదని కానీ కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తూ పార్లమెంటులో మహిళల అదృశ్యం నిజమేనని తేల్చిందన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా మహిళలు అదృశ్యం మాట నిజమేనని ఒప్పుకున్నందుకు సంతోషమని వెల్లడించారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీఎం జగన్‌పై తీవ్రంగా విరుచుపడ్డారు. దేశంలో ఇదే తొలిసారి. పాలనపై విధ్వంసం అనే పుస్తకం రావడం మొదటిసారిగా చూస్తున్నా. నా మనసులోనే కాదు 5 కోట్ల ప్రజల మనసులో ఉంది విధ్వంసం పుస్తకంలో రాశారు. సైకో పాలనలో మన పిల్లల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తున్నారంటే పాలన ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. 30వేల ఎకరాలు 33వేల మంది రైతులు రాజధాని కోసం భూమి ఇచ్చారంటే అది త్యాగం. రాష్ట్రం బాగుపడాలని స్వచ్చందంగా ముందుకు వచ్చి 30వేల ఎకరాలు ఇచ్చారు. అమరావతిలో రాజధాని కట్టి ఉంటే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి ఉపాధి దొరికేది. అమరావతి నిర్మించి ఉంటే రూ.2లక్షల కోట్లు వచ్చేవి. రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశారు. ఇప్పుడు నాలుగోవ రాజధాని హైదరాబాద్ కావాలని మాట్లాడుతున్నారు. కనీసం వైసీపీ నేతలకు సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. .

రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తోసేసిన ముఖ్యమంత్రిని రాజకీయ చరిత్రలో మొదటిసారి చూశా. అమర్ రాజా ఇండస్ట్రీని వేధిస్తే తెలంగాణకు పోయింది. పాపం గల్లా జయదేవ్ తన వ్యాపారం కాపాడుకోవాలి కాబట్టి రాజకీయాలకు దూరమవ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం నేను, పవన్ కలిసి పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా? ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. తన సొంత చెల్లిని, తల్లిని సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటే ఏం చెప్తాం. అలిపిరిపైన బ్లాస్ట్ చేసినా‌ ప్రాణానికి భయపడలేదు. అసెంబ్లీలో నాపైన చేసిన దానికి కన్నీరు పెట్టుకున్నా. ఎమ్మెల్సీ.. ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశాడంటే రాష్ట్రంలో పరిస్ధితి ఏ విధంగా అర్ధం చేసుకోండి.

ఈ సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి తరమికొట్టాలి. నాది, పవన్‌ది ఒక్కటే లక్ష్యం. తిరగుబడతారా? బానిసలుగా ఉంటారా? అనేది మీరే ఆలోచించుకోండి. ఇంకా 54 రోజుల మాత్రమే సమయం ఉంది. జగన్‌ను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంచితే‌నే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. వాలంటీర్లు చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది అని ఈ జగన్ అంటున్నారు. నువ్వు, మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే.. మా టీడీపీ కార్యకర్తలు, ‌జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడతపెడతారు. అందరూ కుర్చీలు మడతపెడితే నీ కుర్చీ లేకుండా పోతుంది అంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

More News

ఎలక్టోరల్ బాండ్లతో రూ.16వేల కోట్ల విరాళాలు.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అందించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బాండ్లపై తీవ్ర చర్చ మొదలైంది.

YS Jagan: కాబోయే లీడర్లు వాలంటీర్లే.. యుద్ధానికి సిద్ధం కావాలని సీఎం జగన్ పిలుపు..

రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే అని ఏపీ సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యం అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం

Komatireddy: హరీష్‌రావును సీఎంగా చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. కృష్ణా నది ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

Rajadhani Files: ఏపీలో 'రాజధాని ఫైల్స్' సినిమా నిలిపివేసిన అధికారులు.. ఎందుకంటే..?

రాజధాని ఫైల్స్‌(Rajdhani Files) సినిమా ప్రదర్శనను ఏపీలో పలు చోట్ల అధికారులు నిలిపివేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

KCR: కేసీఆర్ తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు.. ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ..?

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఛలో నల్లగొండ సభలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది.