ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్..

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లారు. మెగా డాటర్ నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగబోతోంది. వధూవరులతో పాటు ఇరువైపుల పెళ్లిపెద్దలు సోమవారమే రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్ వీరి వివాహానికి వేదికైంది. సంగీత్, మెహందీ ఫంక్షన్, పసుపు వేడుక తదితర వేడుకలతో ఉదయ్ విలాస్ సందడిగా మారింది.

ఈ వివాహానికి నేటి ఉదయం వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మినహా మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ చేరుకుంది. దీంతో పవన్ కూడా నేటి సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లారు. కాగా.. సంగీత్ వేడుకలో మెగా హీరోలంతా డ్యాన్స్‌లతో ఇరగదీశారు. ఇక నిహారిక, చైతన్యల జంట చిరు పాటలకు స్టెప్పులేసి అలరించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ సంగీత్‌లో స్టెప్పులేసి అలరించారు. కాగా.. నిహారిక, చైతన్యల వివాహం రేపు సాయంత్రం జరగనుంది.