ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్‌' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Monday,March 02 2020]

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి వ‌కీల్ సాబ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బేబీ వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్‌పై శిరీష్, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి పి.ఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈసినిమాలో ఓ సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారట‌. ఇక ఫ‌స్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే... తిప్పిన కుర్చీపై కాళ్లు పెట్టుకుని తీరిగ్గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పుస్త‌కం చ‌దువుకుంటున్న‌ట్లు ఆ లుక్ ఉంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే 15న సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

2018 ‘అజ్ఞాత‌వాసి’ త‌ర్వాత ప‌వ‌న్ పూర్తిస్థాయి రాజ‌కీయాల‌తో బిజీగా మారిపోయారు. దాంతో ఆయ‌న సినిమాల‌కు పూర్తిగా దూరం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే రానున్న ఎన్నికలకు సమయం ఉండ‌టంతో అప్ప‌టికే క‌మిట్ అయిన సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే ఎక్కువ రోజులు సినిమాల‌కే కేటాయించ‌కుండా ప‌రిమిత‌మైన రోజుల కాల్షీట్స్‌ను కేటాయిస్తూ వ‌స్తున్నారు. ఇది కాకుండా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు.

More News

'స‌రిలేరు నీకెవ్వ‌రు' యాభై రోజుల వేడుక

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై

ప్రారంభమైన నిఖిల్‌ - చందు మెుండేటి  'కార్తికేయ‌2'

నిఖిల్‌, చందు మెుండేటి ల కాంబినేష‌న్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2, ఈ రోజు తిరుమ‌ల తిరుప‌తి లోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధానం లో

ఏదీ ప్లాన్ చేయ‌డం లేదు.. అలా స‌క్సెస్‌లు వ‌స్తున్నాయి: నాని

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా

బ‌న్నీ.. అర్హ స‌ర‌దా సంభాష‌ణ‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న కుమారుడు అయాన్‌, కుమార్తె అర్హ‌ల‌తో ఖాళీ స‌మ‌యాల్లో స‌ర‌దాగా గ‌డుపుతుంటాడు.

రెగ్యులర్ షూటింగ్ లో బాలకృష్ణ, బోయపాటి చిత్రం

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేస్తున్న మూడో సినిమా,